Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 11 Series: గూగుల్ (Google) ఫ్లాగ్షిప్ Pixel 11 సిరీస్‌ను ఆగస్టు 12న జరిగే “Made by Google” ఈవెంట్లో ఆవిష్కరించనుంది. అధికారిక ప్రకటనకు ముందే ఈ సిరీస్‌కు సంబంధించిన ధరలు, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. Pixel 11 సిరీస్‌లో ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్ని మోడళ్లలో 256GB స్టోరేజ్‌ను స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది.
లీక్ వివరాల ప్రకారం.. Pixel 11 Pro (256GB) ధర GBP 1,079 (రూ. 1,37,796)గా, Pixel 11 Pro XL (256GB) ప్రారంభ ధర GBP 1,279 (రూ.1,63,338) గా ఉండే అవకాశం ఉంది. ఈసారి 128GB స్టోరేజ్ వేరియంట్‌ను తొలగించి అన్ని Pixel 11 మోడళ్లను నేరుగా 256GB స్టోరేజ్‌తో విడుదల చేయనున్నారు. ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ముడి సరుకుల తయారీ ఖర్చులు పెరగడం అని సమాచారం. అంతేకాకుండా 256GB స్టోరేజ్‌ను బేస్ వేరియంట్‌గా అందించడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. అయితే ఈ ధరలపై గూగుల్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Also Read
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
లీక్ ప్రకారం.. Google Pixel 11 4,985mAh బ్యాటరీ, Google Pixel 11 Pro 4,850mAh బ్యాటరీ, Google Pixel 11 Pro XL 5,115mAh బ్యాటరీ ఉండనున్నాయి. గత ఏడాది వచ్చిన Pixel 10 సిరీస్‌తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యం స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే కొత్త Tensor చిప్ మరింత పవర్ ఎఫిషియెంట్‌గా ఉండే అవకాశం ఉండటంతో బ్యాటరీ బ్యాకప్‌లో పెద్దగా తేడా కనిపించకపోవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆగస్టు 12న జరగనున్న Made by Google ఈవెంట్లో Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL స్మార్ట్ఫోన్లతో పాటు Pixel Watch 5ను కూడా కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త AI ఫీచర్లు, సాఫ్ట్వేర్ అప్డేట్స్కు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సమాచారం మొత్తం లీక్‌ల ఆధారంగానే ఉంది. ధరలు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు గూగుల్ అధికారిక ప్రకటన తర్వాతే ఖరారు కానున్నాయి.
Pixel 11 Pro. Coming in two weeks. pic.twitter.com/jk43BTY5Vm
— Pixel Updates (@pixel_updates) July 30, 2026
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?