Maoist Couriers: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరం సమీపంలో మావోయిస్టు పార్టీకి కొరియర్లగా పనిచేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 141 బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలలో వారు పట్టుబడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్. జి తెలిపారు.
Read Also: Krithi shetty : నితిన్ తో కలిసి మరోసారి నటించబోతున్న కృతి శెట్టి..!!
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల వద్ద నుండి 10 జిలిటెన్ స్టిక్స్, 160 మీటర్ల పొడవు గల కార్డెక్స్ వైర్, 5 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఒక డ్రోన్, ఒక లేత్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన ఆ ముగ్గురూ గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేస్తూ, మావోయిస్టు పార్టీ దళాలకు అవసరమయ్యే నిత్యవసరాలను, పేలుడు పదార్థాలను, ఇతర వస్తువులను సరఫరా చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
Read Also: Lust Stories 2: తమన్నా- విజయ్ వర్మల లస్ట్ స్టోరీ.. బెడ్ పై ముద్దులు..
ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, ఇప్పటికే చాలామందిని జిల్లా పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని, పట్టుబడిన వారి వద్ద నుండి వస్తువులను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్. జి తెలిపారు.