చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్ లాంటిది. చికెన్ ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. గత 15 రోజులుగా చికెన్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రిటైల్ మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ.310 ఉండగా.. స్కిన్ చికెన్ కు రూ.260 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు.
జపాన్‌లో జరిగిన 2023 మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ దక్షిణ కొరియాను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 2-1 స్కోరుతో ఓడించి తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరించింది.
దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. 'కొన్నిసార్లు కన్నీళ్లనే తాగాల్సి రావొచ్చు. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే.
444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు.
ప్రొటీన్లు ఎక్కువగా కలిగిన ఆహారం తింటే బరువు తగ్గొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అలాంటి ఆహారం తిన్నప్పుడు స్వల్పంగా అయితే బరువు తగ్గుతారు. జంతువులతో వచ్చే ప్రోటీన్ తీసుకుంటూ, ఆహారంలో పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే మొక్కల ఆహారాన్ని తీసుకోకపోతే.. మీకు మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా టీ- బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పరిగి మండలం కాలాపూర్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. మృతురాలిని శిరీషగా గుర్తించారు. శిరీష రెండ్రోజులుగా కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని నీటి కుంటలో పడేశారు. అయితే శిరీష హత్యపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అంతేకాకుండా శిరీషను చంపి కళ్లను స్క్రూ డ్రైవర్ తో ఛిద్రం చేశారు దుండగులు.
పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పైకి వచ్చి పడుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గమనించిన కానిస్టేబుల్ కె. సుమతి ఆ వ్యక్తిని రక్షించడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.
ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.