Delhi: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్స్ 2023 కోసం భారత జూనియర్ జట్టును ప్రకటించింది. జూలై 7 నుండి 16 వరకు ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌లు జరుగనున్నాయి. జట్టులో కీలకంగా ఉన్న తారా షా మరియు ఆయుష్ శెట్టి ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు. తారా షా బాలికల సింగిల్స్ విభాగంలో నైపుణ్యంతో కూడిన ఆట పట్టుదలతో దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో బాలికల సింగిల్స్ విభాగంలో 7వ ర్యాంక్‌లో ఉన్న తారా షా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా ఆమె స్థానం మరింత పటిష్టం కానుంది.
Read Also: Minister Harish Rao: త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం
అటు బాలుర సింగిల్స్ విభాగంలో కూడా ఆయుష్ శెట్టి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. BWF ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ 20వ స్ధానంలో ఉన్నాడు. BAI ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా జట్టుకు ఆయుష్ సీనియర్ గా.. ఉండి నడిపిస్తున్నాడు. అటు ట్రయల్స్‌లో లక్ష్య శర్మ మరియు రక్షిత శ్రీ ఎస్ కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. బాలుర సింగిల్స్ మరియు బాలికల సింగిల్స్ కేటగిరీలలో వరుసగా మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు జరగబోయే ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పతకాలు సాధించాలని వారు చూస్తున్నారు.
Read Also: Rana : నిర్మాతగా రాణించాలి అనుకుంటున్న రానా..?
నికోలస్ నాథన్ రాజ్ మరియు తుషార్ సువీర్ అద్భుతమైన టీమ్‌వర్క్ తో బాలుర డబుల్స్ విభాగంలో వారు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అటు బాలికల డబుల్స్ విభాగంలో, రాధికా శర్మ మరియు తన్వి శర్మ వ్యూహాత్మక గేమ్ ప్లాన్‌లను ప్రదర్శించారు. దీంతో వారు మొదటి స్థానానికి వచ్చారు. అటు సమరవీర్ మరియు రాధిక శర్మ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్‌లకు ఎంపికయ్యారు.
అటు జట్టు ప్రకటనపై BAI సెక్రటరీ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, “జట్టులో స్థానం సంపాదించడానికి ఆటగాళ్లు ట్రయల్స్ సమయంలో తీవ్రంగా పోరాడారని తెలిపారు. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లు మంచి వేదిక అన్నారు.