Viral News: ఇప్పుడున్న కాలంలో వేరే కులాలకు చెందిన అబ్బాయిలు, వేరే కులాలకు చెందిన అమ్మాయిలతో ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. వారి ప్రేమ సంగతి ఇంట్లో పెద్దలకు చెబితే.. వారు ఒప్పుకోకపోతే ఇంకేటీ సంగతి.. పారిపోయి ఏ గుళ్లోనో, చర్చిలోనో, లేదంటే చివరకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎలానైతేనేం వారిద్దరూ ఒక్కటవ్వడమే చూస్తున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది.
Read Also: Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్
హిందూ, ముస్లిం భాయి భాయి అన్న మాటకు అర్థం చేకూరుస్తూ ఓ ముస్లిం అమ్మాయి, ఓ హిందూ అబ్బాయి హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తిరేపుతోంది. వారిద్దరూ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఇంకేముంది ఇద్దరు ఓకే అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. రూబియా అనే మహిళ.. ఓ హిందూ అబ్బాయితో పరిణయమాడింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆ జంట ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. ముందు పెళ్లికూతురు బురక వేసుకుని నడుస్తుంటే.. వెనుకలా అబ్బాయి నడుస్తున్నాడు. వీరి వివాహాన్ని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత ఆమె పేరును రజనీగా మార్చుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఈ ఘటన రామాపూర్ మధుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.