ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలకు రూ.25కోట్లు చొప్పున, జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని.. దాంట్లో అనుమానమే లేదన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం.. వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా…
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి పాదయాత్రలో కలవడం ఇదే మొదటిసారి. జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం గురించి చర్చించారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు.
గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో శేజల్ నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమేను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆమే ప్రాణాల నుండి బయటపడింది. అయితే ఆమే ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణలకు ఆధారాలు లేవు అంటున్నారని.. నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఆధారాలు ఉంటాయా అని శేజల్ అన్నారు. అలా కూడా తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని.. 6 నెలల నుండి ఫైట్ చేస్తున్నట్లు…
టొమాటో తర్వాత ఇప్పుడు ఉల్లి కూడా కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా బంపర్ జంప్ నమోదైంది. కిలో రూ.15 పలికిన ఉల్లి ధర.. ఇప్పుడు రూ.20 నుంచి 25కి చేరింది. ఈ విధంగా గత 4 రోజుల్లో ఉల్లి ధర కూడా రూ.10 పెరిగింది. ఉల్లిపాయల హోల్‌సేల్ ధర గురించి మాట్లాడితే.. 25 శాతం పెరిగింది.
నేటి కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు రికార్డు సృష్టిస్తోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి మే నెలలో ఆధార్ ఆధారిత ముఖ-ప్రామాణీకరణ ద్వారా 1.06 కోట్ల లావాదేవీలు జరిగాయి.
మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నవ్వింది.. కాని ఈరోజు స్వచ్ఛ్…
జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరుగనున్నాయి. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ కూర్పులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉంది..!.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే కొట్టుకొని పోతారని విమర్శించారు. దోపిడీలు చేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలని.. వారు దొంగలుగా ముద్రించబడతారని ఆరోపించారు. మూడు ఎకరాలు ఇస్తామని.. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను నట్టేటా ముంచారని భట్టి విక్రమార్క తెలిపారు.