Bandi Sanjay: మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నవ్వింది.. కాని ఈరోజు స్వచ్ఛ్ భారత్ పేరుతో నవ్విన నోల్లకు తాళం వేసాడని ఆరోపించారు. అంతేకాకుండా10కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి మోడీ అని కొనియాడారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ.. ప్రపంచాన్ని కోవిడ్ నుండి కాపాడిన మహానుభావుడు మోడీ అన్నారు. ప్రపంచ దేశాలు మోడీకి పాదాభి వందనం చేస్తున్నారని.. 2వేల కోట్ల డోసుల కోవిడ్ టీకాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు బండి సంజయ్.
Read Also: Mahesh Babu: దిల్ రాజు వారసుడు ఫంక్షన్ లో.. తండ్రీకూతుళ్ళ రచ్చ
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసిఆర్ ఢిల్లీకీ పోయి అడిగితే.. కేంద్రం లక్షల ఇళ్లు ఇస్తే అవి పేదలకు అందలేదన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు.. 1లక్ష ఎనభై వేలు నిరుద్యోగ భృతి ఎక్కడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా రైతులకు రుణ మాఫీ చేయలేదని.. రైతులను బీఆర్ఎస్ ఫ్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. కరీంనగర్ వచ్చి.. పంట నష్టపరిహారం ఇస్తానని రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. పారాసిటమాల్ నాయకుడు కేసీఆర్ అని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ముంచిన ఘనత కేసీఆర్ దని అన్నారు. రుణమాఫీ చేయకపోగా.. ప్రీ యూరియా అంటూ రైతులను మబ్బె పెడుతున్న మూర్ఖుడు కేసీఆర్ అని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో పర్సెటీంజీల పర్వం కొనసాగుతుందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా దశాబ్ధి ఉత్సవాల పేరుతో 5 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణను ఆగం చేసిండని కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శల జల్లు కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను దాచుకుని ప్రజలను మోసం చేస్తున్న ఘనుడు కెసిఆర్ అని అన్నారు. పండించిన పంటను కొనలేని చేతకాని ప్రభుత్వం బీఆర్ఎస్ అని.. కేసీఆర్ బ్రోకర్ పనిచేయడంలో నెంబర్ వన్ అని దుయ్యబట్టారు. మరోవైపు సుశ్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చారని.. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. శ్రీకాంత్ చారి బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. కేసీఆర్ కుటుంబం ఎవ్వరూ ఉద్యమం కోసం ఎవ్వరూ పోరాడలేదని తెలిపారు…