ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో తెలంగాణలో పర్యటించనున్నారు. వచ్చే నెల 8న ప్రధాని వరంగల్ కు రానున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. వరంగల్ టూర్ లో భాగంగా.. అధికార కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు ప్రకటనపై పలువురు మాజీ క్రికెటర్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా వైస్ కెప్టెన్ నియామకంపై కొందరు భగ్గుమంటున్నారు. వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే పేరును బీసీసీఐ ఖరారు చేసింది.
ఏ వ్యక్తి జీవితంలోనైనా పడకగది చాలా ముఖ్యమైన భాగం. పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద పడుకోగానే అలసట అంతా పోతుంది. ఇంట్లో ఎక్కువ సమయం ఇక్కడే గడుపుతారు. అంతేకాకుండా చాలా సార్లు మనం టీ తాగుతాం. మంచం మీదనే ఆహారం తింటాము. తెలిసో తెలియకో ఇలాంటివి ఎన్నో పనులు చేస్తాం. అయితే వాటి వల్ల సమస్యలు మన జీవితాన్ని చుట్టుముడతాయి. ఈ తప్పుల వల్ల ఇంట్లో అనైక్యతతోపాటు ఆర్థిక చికాకు కూడా ఏర్పడుతుంది.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు కిడ్నీ వ్యాధి 60 ఏళ్ల తర్వాత వచ్చేదని.. ఇప్పుడు 30 ఏళ్లలోనే కిడ్నీ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నీ వ్యాధులు స్త్రీలలో మరియు పురుషులలో పెరుగుతున్నప్పటికీ.. కిడ్నీలో రాళ్ళు మరియు మూత్ర ఇన్ఫెక్షన్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల పట్ల మహిళలు శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. అది…
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.
క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తన ప్రవర్తనను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నిరాడంబరమైన వ్యక్తులను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడే వారు అందరికి నచ్చుతాడు. నమ్రత అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. అయితే జీవితంలో నిరాడంబరంగా ఉండడం ద్వారా.. మీరు మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కెమెరాలు కలిగిన అనేక స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముందుగా 200 మెగా పిక్సెల్ కెమెరాతో Realme 11 Pro+ ఇండియాలో ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఫోటోగ్రఫీని(Photography) ఇష్టపడే వారు ఎక్కువ మెగా పిక్సెల్(Mega Pixel) కెపాసిటీ ఉన్న ఫోన్‌ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు బీభత్సంగా అమ్ముడవుతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే ఫోన్ తో మీరు మంచి ఫొటోలను తీయగలరు.
బరువు తగ్గడానికి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు.. వాకింగ్, యోగా మరియు వ్యాయామాలను చేర్చడం చాలా ముఖ్యం. బరువు తగ్గేందుకు చాలా మంది ఆకలిని చంపుకుంటున్నారు. అలా చేసే బదులు.. మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకుంటే చాలు. డ్రై ఫ్రూట్స్‌లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. దీని కారణంగా ఆకలి నియంత్రించబడుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు. నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి స్నాక్స్‌గా ఉపయోగపడతాయి.
మధుమేహం మరియు క్యాన్సర్ మాదిరిగానే అధిక కొలెస్ట్రాల్ సమస్య కూడా నిరంతరం పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. దీని వల్ల గుండెపోటు, గుండె ఆగిపోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందో సాధారణంగా ప్రజలకు తెలియదు. చాలా మంది వ్యక్తులు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా మాత్రమే దీనిని గుర్తిస్తారు.