సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీఆర్ఎస్ సర్కారును కదిలించింది. ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ ను ప్రజల వద్దకు పరుగులు తీసేలా చేసింది. పోడు భూముల గురించి పట్టించుకోని సీఎం కేసీఆర్.. ఈనాడు పట్టాలు పంపిణీ చేయడం పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై భట్టి చేసిన పోరాట ఫలితమే. ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో సరికొత్త ప్రజా విప్లవోద్యమంలా మారింది.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన కూతురు పై హైకోర్టును ఆశ్రయించిన విషయంలో భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాజ్ఞాస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేయబడిన 134 వైద్య పరీక్షలను వర్చువల్గా ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. అమాయకురాలైన నా బంగారు తల్లి.. నా బిడ్డను వాడుకొని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండటం, బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అధ్యక్షుడి మార్పు అంశం తెరపైకి వచ్చింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని, అలాంటి ఆలోచన హైకమాండ్ కు లేదని కిషన్ రెడ్డి…
భట్టి పాదయాత్ర చరిత్రాత్మక విషయమని వీహెచ్ కొనియాడారు. భట్టి పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. బీసీ ప్రధాని అయినా.. బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. కులాల వారిగా జనాభా గణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారని వీహెచ్ అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మంలో 10 సీట్లు కాంగ్రెస్ దే అన్నారు. రేవంత్, భట్టి కలిసి పని చేయాలని ఆయన అన్నారు. బలగం సినిమా చూశానని.. 30 ఏండ్ల…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న(గురువారం) పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఐసిసి సంస్ధాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఛత్తీస్ ఘడ్ వ్యవహారాల పై సమీక్ష సమావేశం ముగియగానే రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. మానుకోటలో రూ.50 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అసహనానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రారంభించేందుకు వెళ్తున్న కేటీఆర్ తో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా ఎమ్మెల్యే చేయిని తీసి పడేశారు.
హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా బ్యాంకుల సహాయంతో లోన్స్ పొంది.. పెద్ద ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదుగుతున్న వారు వారి వారి అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా మహిళ పారిశ్రామిక వేత్తలు బ్యాంక్‌ల ద్వారా తమకు అందుతున్న సహాయాన్ని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని తెలిపారు. అందుకోసం సభ ఏర్పాట్ల పరిశీలనకై ఖమ్మం వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీగా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భారీ ఎత్తున సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులు అడిగారన్నారు. ఆర్టీసీ అధికారులు ముందు బస్సులు ఇస్తామని, ఇప్పుడు బస్సులు ఇవ్వలేమని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై 2వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ సభ కోసం దాదాపు 5 లక్షల మంది ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాహుల్ గాంధీ జన గర్జన సభకు ఆటంకాలు కలిగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తొందని పొంగులేటి మండిపడ్డారు.