విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన రియల్టర్ శ్రీనివాస్ కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. అయితే ఈ వ్యవహారంపై నగర సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితులు, నిందితులు పరిచయస్తులేనని ఆయన తెలిపారు. వీరికి విజయవాడలో పరిచయాలు ఉన్నాయని.. వీరు 2019లో విజయవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్ పేరిట వ్యాపారం నడిపారని త్రివిక్రమ్ వర్మ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం అందాలనేది తన బలమైన…
విపక్షాల రెండో సమావేశం బెంగళూరులో వచ్చే నెల 13వ తేదీ, 14వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు శరద్ పవార్ తెలిపారు. బెంగుళూరులో విపక్షాల భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరు నేతలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవార్ వెల్లడించారు. వచ్చే నెల మధ్యలో వర్షాలు ఉధృతంగా కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షిమ్లాలో సమావేశ నిర్వహణ సరైన నిర్ణయం కాకపోవచ్చనే అభిప్రాయానికి ప్రతిపక్షాలు వచ్చాయి. వాతావరణ పరిస్థితులు కారణంగా అక్కడ భారీ వర్షాలు…
జయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.
నసేన అధినేత పవన్ కల్యాణ్ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మాకు తొడలు కొట్టి మీసాలు తిప్పడం రాదు. నాయకుడంటే ఆదర్శం కావాలి, జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం కాదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. యువతకు పవన్ కల్యాణ్ చెడు సందేశం ఇస్తున్నాడని.. పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. మీరు కూడా 40 పెళ్లిళ్లు చేసుకోండనే సందేశంతో ఆడపిల్లల తల్లిదండ్రులు బాగోద్వేగానికి గురవుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ పెద్దమ్మతల్లి గుడి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్ ను పేస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. శేజల్ కి ఎమర్జెన్సీ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నట్లు.. శేజల్ ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఆయుర్వేదిక్ సంబంధించిన నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. మరికొద్దిసేపట్లో శేజెల్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు పేస్ అసుపత్రి వైద్యులు తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గతంలో ఆరోపణలు చేసిన షేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆదినారాయణ రావు షేజల్ ను పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలివెళ్లాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన దగ్గర సరైన ఆధారాలు లేవు అన్న మాటలకి షేజల్ మనస్థాపం చెంది.. నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది.
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున TS ICET 2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్ వరంగల్‌లో విడుదల చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆరోపించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.