Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే కొట్టుకొని పోతారని విమర్శించారు. దోపిడీలు చేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలని.. వారు దొంగలుగా ముద్రించబడతారని ఆరోపించారు. మూడు ఎకరాలు ఇస్తామని.. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను నట్టేటా ముంచారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని అడవిలో ఉన్న ఆదివాసీలతో సహా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం రండి అంటూ.. మాకు ఓపిక నశించింది కేసిఆర్ ప్రభుత్వాన్ని పాతరైసే అంతవరకు నిద్రపోమని భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని.. ఈ మధు నష్టపు ముఖ్యమంత్రి ఇంతవరకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కిందపడేసి తొక్కల్సిందేనని రైతాంగం డిసైడ్ అయిందని భట్టి విమర్శించారు. పాదయాత్రలో పాల్గొంటే మా మీద కేసులు పెడతాం అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతామని బెదిరించారన్నారు. పీపుల్స్ మార్చ్ అంటే ఇల్లు పింఛను లేక ఎటువంటి ఆసరా అందనటువంటి నిరుపేదల అడిగే పీపుల్ మార్చ్ అని భట్టి పేర్కొన్నారు. రేపు రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిరుపేదలకి నెలకి సరిపడా ఇంటి గ్యాస్ 500 రూపాయలకి ఇస్తామని ఘంటాపదంగా చెప్పారు.
Read Also: Pawan Kalyan: తెలంగాణ తరహాలో ఉండాలనేది నా కోరిక.. భీమవరంలో పవన్ కల్యాణ్..!
మరోవైపు రైతుబంధుతో పాటు రైతు రుణమాఫీ కూలీ బందు కూడా ప్రతి ఒక్క నిరుపేదకే అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు.. పనిచేసి చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం మా చేతిలో ఉందని పోలీసులు మేం చెప్తే వింటారని అడ్డ గోలిగా కేసులు పెడితే ఊరుకునేది లేదని.. పోలీసులు బీఆర్ఎస్ నాయకుల్లా ప్రవర్తిస్తే సహించేది లేదని భట్టి మండిపడ్డారు. మరోవైపు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. నువ్వు పద్ధతితో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రజల కోసమే పని చేస్తానని.. ప్రజల సమస్యలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనిచేస్తుందని.. నిరుపేద ప్రజల కోసమే ఈ భట్టి పనిచేస్తారని ఆయన అన్నారు.