Central Cabinet: జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరుగనున్నాయి. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ కూర్పులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉంది..!. వచ్చే సోమవారం “కేంద్ర మంత్రి మండలి” ( యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశం తర్వాత ఏ క్షణంలోనైనా కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రాలవారీగా ప్రాతినిథ్యం, రాజకీయ, పార్టీ అవసరాలకు అనుగుణంగా తగు నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
Read Also: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తున్న సిక్కు అత్యున్నత సంస్థ..
మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల బిజేపి అధ్యక్షుల నియామకాలకు సంబంధించి బిజేపి అధినాయకత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలను బట్టి కేంద్రమంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఏపి కంటే, తెలంగాణ బిజేపి అధ్యక్ష నియామకంపైనే పార్టీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. తెలంగాణలో పార్టీ పరిస్థితి, సామాజిక సమీకరణాలు, రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితి లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తగు నిర్ణయాలు తీసుకోనుంది. తెలంగాణలో నిన్నమొన్నటి వరకు జోరుగా ఉన్న బిజేపి నెమ్మదించి.., ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జోరు పెరగడంతో రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో అగ్రనాయకత్వం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
Read Also: Suhas: రైటర్ పద్మభూషణ్.. ఈసారి ‘శ్రీరంగ నీతులు’ చెప్తాడట
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ బిజేపి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.., ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్రమంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తద్వారా తెలంగాణలో ప్రభావంతమైన, బలమైన మున్నూరు సామాజిక వర్గం అసంతృప్తి చెందకుండా ఉంటుందని బిజేపి అగ్రనాయకత్వం ఆలోచనలో ఉంది. ఇక, ఏపీలో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా మూడేళ్ళ పూర్తి చేసుకున్నా.., ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చు లేదా కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఏపి బిజేపి అధ్యక్షుడుగా సోము వీర్రాజును కొనసాగించేందుకే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు టీడీపీతో పొత్తులపై చర్చలు లేవంటున్నాయి బీజేపీ వర్గాలు.