విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హారం.
అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మరోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠశాల, పది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి.
మొగల్రాజపురంలో ఆదివారం మెడ్సీ హాస్పిటల్స్ ను మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ ఎండీ శిరీషా రాణివిశిష్ట, పలువురు ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అదుపుతప్పి టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. కర్ణాటకలోని చింతమనుగురు నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది.
తెలంగాణలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ జోడి... జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్‌తో హ్యాట్రిక్ సాధించారు.