వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు.
వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలోని పలు కాలనీల్లో ఎక్కడిక్కడ వరద నీరు పేరుకుపోయింది. దీంతో పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా పంజాబీ బాగ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయి తల్లీ కొడుకు మృతిచెందారు.
తెలంగాణ రాష్ట్రంలో నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీలు అయ్యారు. 15 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో IAF విమానానికి చెందిన ఇంధన ట్యాంక్‌లను పోలీసులు గుర్తించారు. వాటిని శిక్షణ కోసం వాడుతామని.. ఆ యుద్ధ విమానాలు తమవే అంటూ భారత వైమానిక దళం తెలిపింది.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.