Korea Open: హ్యాట్రిక్తో అదరగొట్టిన సాత్విక్, చిరాగ్ శెట్టి.. కొరియా ఓపెన్ టైటిల్ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి మళ్లీ చెలరేగారు. దీంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశారు. మార్చిలో స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ జోడి… జూన్‌లో ఇండోనేషియా ఓపెన్ గెలిచారు తాజాగా కొరియా ఓపెన్ 2023 టైటిల్‌తో హ్యాట్రిక్ సాధించారు. మెన్స్ డబుల్స్‌లో భారత జోడికి తొలి కొరియా ఓపెన్ టైటిల్ అందించారు. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు 2017లో కొరియా ఓపెన్ టైటిల్ గెలిచింది. వరల్డ్ నెం.1 ఇండోనేషియన్ జోడి ఫజర్ అల్‌ఫియన్- మహ్మద్ రియాన్ అర్డియంటోతో ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి 17-21, 21-13, 21-14 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది.
Rakul Preet Singh : బికినీ అందాలతో రచ్చ చేస్తున్న హాట్ బ్యూటీ..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
మొదటి సెట్‌లో ఓడిపోయినప్పటికీ.. రెండో సెట్ లో పుంజుకున్నారు భారత పురుషుల డబుల్స్ జోడి. ఇండోనేషియన్ జోడి రెండో సెట్‌ని 4-2 తేడాతో ఆధిక్యం సాధించి ఆరంభించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి చేసిన తప్పులను సరిగ్గా వాడుకున్న భారత జోడి, రెండో సెట్‌ని 21-13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో భారత జోడి ఆధిక్యాన్ని కొనసాగించింది. 11-8 తేడాతో తొలి సగాన్ని ముగించిన భారత జోడి, రెండో సెట్‌ని 21-14 తేడాతో గెలిచి.. కొరియా ఓపెన్ గెలిచిన మొట్టమొదటి భారత జోడిగా నిలిచింది.
Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
అటు సెమీ ఫైనల్‌లో వరల్డ్ నెం.2 జోడి చైనాకి చెందిన లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్‌లను 21-15, 24-22 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది భారత్ జోడి. అంతకుముందు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, మలేషియా ఓపెన్‌లో భారత జోడిపై లియాంగ్ వీ కెంగ్- వాంగ్ ఛాంగ్ విజయం సాధించారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి.. ఈ ఏడాది మెన్స్ డబుల్స్‌లో మూడు సూపర్ ఓపెన్ టైటిల్స్ గెలిచారు. అంతేకాకుండా ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణం సాధించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు థామస్ కప్, సయ్యద్ మోదీ సూపర్ 300, స్విస్ ఓపెన్ 300, థాయలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్స్ గెలిచారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!