జీర్ణక్రియ సరిగ్గా ఉంటే సగానికిపైగా వ్యాధులు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. దాని కారణంగా మీ శరీరం మరియు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దాంతో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్రెత్తిపోయింది. ఔట్ కాకుండా అంపైర్ ఔట్ ఇచ్చినందుకు సహనాన్ని కోల్పోయింది. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది.
మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
రద్దీగా ఉండే రోడ్డుపైనే వాహనాలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారి భూమి బద్దలైంది. దీంతో అక్కడున్న వాహనాలు గాల్లోకి ఎగిరాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డే క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరుగుతున్న మూడో వన్డేలో ఫర్జానా హాక్ సెంచరీ చేసింది.
భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లోని చాలా జిల్లాల్లో చెరువులు, కుంటలు, నదుల నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 20 నుండి నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీనగర్ శివార్లతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు.