ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అంతేకాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్న సీఎం కేసీఆర్ మద్దతు తప్పనిసరి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వర్షం పడుతుండటంతో బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో.. పొన్నం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు.
ఆదివారం తెల్లవారు జాము నుంచి మళ్ళీ గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 42 అడుగులతో గోదావరి నీటిమట్టం ఉంది. అంటే మొదటి ప్రమాదవ స్థాయి దిగువలో గోదావరి వరద భద్రాచలం వద్ద ఉన్నది. దిగువన ఉన్న పోలవరం వద్ద గోదావరి నీరు వేగంగా వెళ్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద తగ్గు ముఖం పట్టింది.
హైదరాబాద్ లోని చైతన్యపురిలో పోపిస్ట్రా అనే మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మత్తుమందును విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన రమేష్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీభవన్ ప్రకాశం హాల్ లో జరిగిన అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశంలో భట్టి విక్రమార్క, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
జింబాబ్వేలో జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ప్లేయర్స్ కొద్దోగొప్పో ప్రదర్శన మాత్రమే చూపిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం భారత్ కు చెందిన ఆరుగురు వెటరన్లు పాల్గొన్నారు. ఐతే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన చూపలేకపోయారు.