టీమిండియా ఇంటర్నేషనల్ హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. అక్టోబర్- నవంబర్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడనుంది. ఆ తర్వాత ఈ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ భారత జట్టు స్వదేశంలో ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ లు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. అందుకు సంబంధించి షెడ్యూల్ తో పాటు వేదికలు, టైమింగ్స్ ను కూడా […]
డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న విషయంలో సింగపూర్ ప్రభుత్వం అత్యంత కఠిన శిక్షలు అమలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన కేసులో ఇద్దరు దోషులను ఉరి తీయనున్నారు. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. గత 20 ఏళ్లలో సింగపూర్ లో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి.
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాల ప్రభావంతో హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదతో నోయిడాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వంద కార్లు నీటమునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుండి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, తమిళనాడులోని చెన్నై, ఢిల్లీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.
మణిపూర్ లో ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిమిషాల్లోనే మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మణిపూర్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టింది.
రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన అంజు.. అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంజు తన ప్రేమికుడు నస్రుల్లాతో కలిసి ఓ మైదానంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.