విజయవాడలోని మొగల్రాజపురంలో ఆదివారం మెడ్సీ హాస్పిటల్ ను మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ ఎండీ శిరీషా రాణివిశిష్ట, పలువురు ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. వైద్య రంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. స్థానిక మొగల్రాజపురంలో ఇప్పటి వరకు హైదరబాద్ నగరంలో ఉన్న మెడ్సీ ఆసుపత్రి ఇప్పుడు విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని.. ఐవీఎఫ్, రిహాబ్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Dil Raju Productions: బలగం తర్వాత కొరియోగ్రాఫర్ ను ‘హీరో’ చేస్తున్న దిల్ రాజు
మరోవైపు హాస్పిటల్ ఎండీ శిరిషా రాణివిశిష్ట మాట్లాడుతూ.. విజయవాడలో తమ మొదటి శాఖను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 శాఖలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఐవీఎఫ్ తల్లి పిల్లలు సంరక్షణతో పాటు కొత్తగా రిహాబ్స్ అనే నూతన పద్ధతికి శ్రీకారం చుడుతున్నామని.. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం వచ్చిన వారు త్వరగా కోలుకోవడానికి హైదరాబాద్ లో మెడ్సిస్ బ్లూమ్స్ అని నూతనంగా చైల్డ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఏపీలోనే తొలిసారిగా అక్టోబర్ నాటికి వైజాగ్ లో అడ్వాన్స్ రెహాబ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని.. విజయవాడ పట్టణ వాసులకు తమ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎండీ పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, అనుభవజ్ఞులైన, డాక్టర్ల పర్యవేక్షణలో సేవలు అందిస్తామని తెలిపారు. అందరి ఆశీస్సులు తమ సంస్థపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు సంస్థ ఎండీ తెలియజేశారు.