ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వరుసగా చీతాలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 8 చీతాలు మృతిచెందగా.. తాజాగా మరో చీతా కన్నుమూసింది. ఆ చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. అయితే కునో అభయారణ్యంలో చీతా చనిపోయి ఉండగా అధికారులు ఉదయం గుర్తించారు.
హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాధితులను గుర్తించి పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
అబుకర్ అలీపై నెటిజన్లు ఫైరవుతున్నారు.100 మీటర్ల రేసులో పాల్గొన్న ఆమే.. స్టాన్స్ పొజిషన్ తీసుకోవడానికి కూడా బద్దకించింది. అంతేకాకుండా మెళ్లిగా పరిగెత్తింది. ఒకానొక సమయంలో రేసు మధ్యలోనే ఆగిపోతుందా అనే సందేహం కలిగింది.
ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు నిర్వహించనుంది. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ పేరుతో ఈ సేల్స్ జరుగనుండగా.. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆఫర్ సేల్ ఉండనుంది.
ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.