Jupally Krishna Rao: ఢిల్లీకి జూపల్లి, రేపు కాంగ్రెస్లో పలువురు చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఢిల్లీకి బయల్దేరిన వీరు.. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
TSPSC: అలర్ట్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ రిలీజ్
Also Read
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఉదయం 9 గంటలకు వీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. అనంతరం వీరు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మెఘా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
China President Xi Jinping: జిన్‌పింగ్ సంచలన నిర్ణయం… అణ్వాయుధ దళ టాప్ అధికారుల తొలగింపు
నిజానికి కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. కానీ భారీ వర్షాల కారణంగా జూలై 20, జూలై 30న రెండుసార్లు ప్రియాంక పర్యటన వాయిదా పడింది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వుండటంతో ప్రియాంక గాంధీ సభ వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జూపల్లి ఢిల్లీ వెళ్లి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జూపల్లి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు కూడా వున్నారు.
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?