ICC World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు.. ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ నిర్వహణ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు తెలపడంతో మార్పులు చేశారు.ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ జరిగే గుజరాత్‌లో అదే రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దీంతో మ్యాచ్ కు భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని.. తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయి. దీంతో బీసీసీఐ.. ఐసీసీకి ప్రతిపాదనలు పంపింది. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అంగీకారం తెలపింది. దీంతో ఐసీసీ షెడ్యూల్ మార్పునకు ఓకే అనేసింది. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు.. అంతకంటే ముందు పాకిస్తాన్ టీమ్ ఆడాల్సిన మ్యాచ్ తేదీలను కూడా మార్చారు. అందులో భాగంగానే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరిగే పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ తేదీని కూడా మార్చారు. ఆ మ్యాచ్ ను అక్టోబర్ 10వ తేదీన జరుగనుంది. దానికి ఇరు జట్లు అంగీకరించాయి.
Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ నవంబర్ 19 వరకు మొత్తం 46 రోజుల పాటు జరుగనుంది. తొలి మ్యా్చ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. టీమిండియా తన తొలి మ్యాచును అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం పది టీమ్‌లు పాల్గొననున్నాయి. ఒక జట్టు మిగతా 9 టీమ్‌లతో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..