ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది.
చైనా రాజధాని బీజింగ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో చైనా అతలాకుతలం అవుతుంది. బీజింగ్ లో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు తీర్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము.. 'సూర్యుడు, చంద్రుడు, నిజం' అంటూ గౌతమ బుద్ధుడి కవితను సంధించారు.
దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. అందులో దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడేలా కనిపించడం లేదు. టీమిండియాకు ఈ వార్త చాలా బ్యాడ్ న్యూస్. కొద్దిరోజులుగా గాయాలతో బాధపడుతున్న ఆటగాళ్లపై బీసీసీఐ మెడికల్ అప్ డేట్ ఇచ్చింది.
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్ లేదా డైట్ లలో ఏదీ బెటర్ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే డైట్ మెయింటెయిన్ చేస్తే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జిమ్ కు వెళ్తే డైట్‌పై దృష్టి పెట్టడం అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్విట్జర్లాండ్ వెళ్లాలనుకునేవారికి అలర్ట్.. భారత్ లోని స్విట్జర్లాండ్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు షెంజెన్ వీసా దరఖాస్తులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు భారీగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.