Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం
- మాది ‘‘లవ్ జిహాద్’’ కాదు..
- ముందుగా మోనాలిసానే పెళ్లిని కోరింది..
- చేసుకోకపోతే చనిపోతానని బెదిరించింది..
- లవర్ ఫర్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monalisa: మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్ చెందిన ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి, తమకు పెళ్లి చేయాలని కేరళ పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. దీంతో వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లి, ప్రేమలో ‘‘లవ్ జిహాద్’’ కోణం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
తామిద్దరం షూటింగ్ నిమిత్తం కేరళంకు వచ్చామని, మరో 20 రోజులు ఇక్కడే ఉంటామని ఫర్మాన్ ఖాన్ తెలిపారు. పెళ్లి ప్రస్తావనపై మాట్లాడుతూ.. మోనాలిసానే తనకు పెళ్లి చేసుకోవాలని అడిగిందని, అందుకు తాను మొదట నిరాకరించారని, కానీ ఇంట్లో వాళ్లు బలవంతంగా వేరే సంబంధం చూస్తున్నారని, పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరించిందని, తన వల్ల ఒకరి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతో తాను పెళ్లికి ఒప్పుకున్నానని ఫర్మాన్ ఖాన్ తెలిపారు.
Also Read
Read Also: Iran-India: భారత్‌కు శుభ పరిణామం.. హార్ముజ్ నుంచి భారీగా కదిలిన భారత్ నౌకలు
పెళ్లి తర్వాత మోనాలిసా ‘‘ఇస్లాం’’లోకి మారుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఫర్మాన్ మాట్లాడుతూ, తనకు అన్ని మతాలు సమానమే అని, మోనాలిసా తన మతంతోనే ఉంటుందని, నేను నా మతాన్ని అనుసరిస్తానని చెప్పారు. తాను గుడికి వెళ్లానని, ఒక వేళ తమది లవ్ జిహాద్ అయితే హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునే వాళ్లం కాదని అన్నారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్నారని, ఇది కొత్తమే కాదని చెప్పారు.
మోనాలిసా పారిపోయి వచ్చిందనే ప్రచారాన్ని కొట్టిపారేసిన ఫర్మాన్.. ఇందులో నిజం లేదని తన తండ్రితో కలిసి కేరళంకు వచ్చిందని చెప్పారు. కేరళలోని మనుషులు ఎదుటి వారిని మనుషులుగా భావిస్తారని, అందుకే ఇక్కడే ఉండాలని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, మోనాలిసా సినిమా డైరెక్టర్ సనోజ్ మిశ్రా దీనిని ‘‘లవ్ జిహాద్’’ అని ఆరోపించారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!