అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 2024 జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి రాజీనామా ప్రకటించారు.
భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువును ఒకదాన్ని పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 340 టన్నుల బరువు ఉంటుందని తెలుపుతున్నారు. సముద్రంలో ఉండే నీలి తిమింగళం కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉండాలి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న జంతువు 39 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ జంతువును పెరువియన్ ఎడారిలో లభించిన అవశేషాల ఆధారంగా గుర్తించారు.
త్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబికాపూర్‌లో నివసించే ఓ మహిళపై .. ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు తన భర్తను హత్య చేసాడు. అనంతరం ఆ రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే అతడి భార్యపై అత్యాచారం చేశాడు.
నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు శాస్త్రీయ సర్వేను ఆపాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను నిరాకరిచిన సుప్రీం.. సర్వేను ‘నాన్-ఇన్వేసివ్ టెక్నిక్’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది.
ఓ మహిళ ఒక్కరోజులో తాగాల్సిన నీరు ఒకేసారి తాగింది.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఇంకేముంది ఆ మహిళ చనిపోయింది. అయితే ఆమే తాగిన నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది.