ఇండియాలో క్రికెట్ అంటే పడి సచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఐపీఎల్, టీ20 మ్యాచ్లంటే క్రికెట్ లవర్స్ టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతారు. అంతేకాకుండా భారత్, ఇతర జట్ల మధ్య మ్యాచ్ ఉంటే.. స్టేడియాల్లో కిక్కిరిసిపోతారు. దీంతో బీసీసీఐ భారీ లాభాన్ని ఆర్జిస్తుంది. అంతేకాకుండా ఇతర కంపెనీలు కూడా విపరీతమైన ఆదాయాలను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీసీఐ తన ఆదాయ ప్రణాళికలో అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలను చేర్చుకోడానికి ప్రణాళికను రూపొందిస్తుంది.
Bandi Sanjay: రేపు ప్రధాని మోడీని కుటుంబ సమేతంగా కలవనున్న బండి సంజయ్
ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కులను విక్రయించి భారీ లాభాలను ఆర్జించిన బీసీసీఐ.. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు యొక్క ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల నుండి సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. తన బిడ్డింగ్ ద్వారా 750 మిలియన్ డాలర్లను ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ హక్కులను పొందే కంపెనీలు.. ఐదేళ్ల క్రితం ఎంత విలువ ఉందో అంతే విలువ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్ లో 102 మ్యాచ్ లు ఉండవచ్చు.
AP CM Jagan: మహిళా,శిశు సంక్షేమశాఖపై సీఎం సమీక్ష.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ అందించిన జగన్
ఈ మ్యాచ్‌ల మీడియా హక్కుల రేసులో అమెజాన్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను చేర్చుకోవాలని భావిస్తోన్న బీసీసీఐ.. వేలం ప్రక్రియను రెండు వారాల పాటు వాయిదా వేసింది. మరోవైపు ఐపీఎల్, షార్ట్ ఫార్మాట్ క్రికెట్ మ్యాచ్‌ల మీడియా హక్కులను కొనుగోలు చేయడానికి కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. 2023 ఐపీఎల్ యొక్క వెబ్ టెలికాస్ట్ హక్కులను రిలయన్స్ కంపెనీ జియో సినిమా కొనుగోలు చేసింది. టీవీ హక్కులు స్టార్ ఇండియా వద్దనే ఉన్నప్పటికీ.. ఈ డీల్‌తో బీసీసీఐ భారీగానే సంపాదించింది.