కూర నచ్చలేదని భార్యను సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బండాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆదివారం రోజు భార్యపై గొడవకు దిగాడు. అంతేకాకుండా దారుణంగా చితకబాదిన భర్త.. అనంతరం భార్యపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి జనాలు అతలాకుతలం అవుతున్నారు. గత 24 గంటల్లో వర్షాల కారణంగా 29 మంది మరణించారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ ఒకరి ప్రాణం తీసింది. యూపీలోని లక్నోకు చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యను తానే హత్య చేశాడు. ఆదివారం పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన వారు.. కారులోనే గొడవపడ్డారు. ఆ తర్వాత తన పిల్లల ఎదుటే భార్యను హతం చేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారని.. అంతేకాకుండా ఆమె తన భర్తను ఇన్‌స్టాలో బ్లాక్ చేసిందని పేర్కొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని.. షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా అధికార బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ నడపడానికి సినిమాలే తనకు ఇంధనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఎన్ని వేషాలు వేసినా మీరు భరించాలిసింది ఆరు నెలలు మాత్రమేనని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
లంక ప్రీమియర్ లీగ్ లో స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇవ్వడం ఇది మూడోసారి. లంక బౌలర్ ఇసురు ఉడానా బౌలింగ్ చేసే క్రమంలో.. అతనికి సమీపంలో నుంచి వెళ్లింది. వెంటనే ఆ పామును చూసిన అతను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాడు. అయితే పాము మైదానంలోకి వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.