ఈ మధ్యకాలంలో స్నేక్ రాజాలు అడవుల్లో కన్నా.. క్రికెట్ మైదానంలో ఎక్కువగా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న లంక ప్రీమియర్ ఆరంభ రెండో మ్యాచ్ లోనే పాము కనపడగా.. ఇప్పుడు మరోసారి దర్శనమిచ్చింది. లంక ప్రీమియర్ లీగ్ లో స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇవ్వడం ఇది మూడోసారి. మొదటిసారిగా పాము స్టేడియంలోకి వచ్చినప్పుడు.. కాసేపు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మరో మ్యాచ్ లోనూ మళ్లీ మైదానంలోకి వచ్చింది. అయితే బౌండరీ సమీపంలో కెమరామెన్ కూర్చునే చోట పాము కననపడింది. ఇప్పుడు వచ్చిన పాము ముచ్చటగా మూడోవది. లంక బౌలర్ ఇసురు ఉడానా బౌలింగ్ చేసే క్రమంలో.. అతనికి సమీపంలో నుంచి వెళ్లింది. వెంటనే ఆ పామును చూసిన అతను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాడు. అయితే పాము మైదానంలోకి వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాకుండా దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ కాదు రాజా.. పదే పదే రావడానికి అని ఒకరు రాయగా.. మరొకరు అది కూడా క్రికెట్ లవర్ కావొచ్చు అందుకే ఎప్పటికి వస్తుందని రాసుకొచ్చారు.
Read Also: Double Ismart: డబుల్ ఇస్మార్ట్ సెట్ లో అడుగుపెట్టిన సంజయ్ దత్..
మాములుగా ఐతే మ్యాచ్ జరిగేటప్పుడు కుక్కలు, పిల్లులు రావడాన్ని మనం ఎక్కువ చూస్తుంటాం. కానీ ఈ మధ్యకాలంలో పాములే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పాములు రావడం వరకు సరే.. కానీ చూడకుండా అవి మైదానంలో ఉన్నప్పుడు క్రికెటర్లకు తగిలితే ఇక అంతే సంగతులు. ఇప్పటి వీడియోలో.. కొంచెం చూడకుండా ఉంటే ఇరుసు ఉడానా.. ఆ పాము మీద కాలు వేసేవాడు. కానీ అదృష్టవశాత్తు చూడటంతో పక్కకు తప్పుకున్నాడు. మరోవైపు కొన్ని మ్యాచ్ లు వర్షాల కారణంగా కానీ.. అనివార్య కారణాల వల్ల కానీ ఆగిపోవడం చూస్తుంటాం. కానీ లంక ప్రీమియర్ లీగ్ మాత్రం విచిత్రంగా పాము ఎంట్రీ ఇస్తుండటంతో కాసేపు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడుతుంది.
Isuru Udana's Lucky escape 🐍#LPL2023 #LPLT20 pic.twitter.com/olOqL21UUr
— Home of T20 (@HomeofT20) August 13, 2023