జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హానీకట్ అనే మహిళ అరుదైన రికార్డు అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమేకు 11.8 ఇంచుల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు.
విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న 14 ఏళ్ల బాలిక పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు. అతడు భారత సంతతికి చెందిన డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు.
ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను పేల్చేందుకు బాంబు అమర్చామని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సందర్శకులందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు, బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్‌లో అతను రాయల్ లండన్ వన్డే కప్ లో ససెక్స్ తరుపున ఆడుతున్నాడు. 319 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా.. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు పుజారా.. దీంతో ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం విశేషం. అయితే.. ఈ […]
కర్నాటకలో ఓ బస్సు డ్రైవర్ పై బైకర్ దాడి చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన బైక్ ను బస్సు ఢీకొట్టిందని ఆ వ్యక్తి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ పై ద్విచక్రదారుడు దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బైకర్ ను అరెస్టు చేశారు.
మణిపూర్ అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వందరోజులుగా మండిపోతుంటే పార్లమెంట్ లో ఎంపీలు ఏం మాట్లాడరని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.