Nuh Voilence: నుహ్ హింసకు పాల్పడిన నిందితుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నుహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో గత నెలలో జరిగిన మత హింసకు సంబంధించి హర్యానాకు చెందిన బజరంగ్ దళ్ సభ్యుడు బిట్టు బజరంగిని పోలీసులు అరెస్టు చేశారు. అతను సహచర భజరంగ్ దళ్ కార్యకర్తలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్పి హింసను ప్రేరేపించేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. బిట్టు బజరంగీ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నుహ్ లో హింస చెలరేగిన దాదాపు 20 రోజుల తర్వాత అతని ఇంటి దగ్గర పట్టుబడ్డాడు. నుహ్ లో జరిగిన మత ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కనీసం 70 మంది గాయపడ్డారు. మరోవైపు నుహ్ లో ప్రారంభమైన హింసాకాండ గురుగ్రామ్ నుండి 40 కి.మీ దూరంలోని బాద్షాపూర్ వరకు వ్యాపించింది.
Read Also: Rishabh Pant: టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీ..?
Also Read
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్.. ఫరీదాబాద్‌లోని గాజీపూర్ మార్కెట్ లో పండ్లు మరియు కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అంతేకాకుండా.. భజరంగ్ దళ్ సభ్యుడు.. గత మూడేళ్లుగా గోసంరక్షక బృందాన్ని నడుపుతున్నాడు. గత ఒక్క నెలలోనే మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. మరోవైపు నుహ్ హింసాకాండ తర్వాత ఫరీదాబాద్‌లో గోరక్ష బజరంగ్ ఫోర్స్ చీఫ్‌పై కేసు నమోదైంది.
Read Also: SBI : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..
హర్యానాలోని ఫరీదాబాద్‌లో బిట్టు బజరంగిని పోలీసులు చాలా సేపు వెంబడించి పట్టుకున్నారు. అల్లర్లు, హింస, బెదిరింపులు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారిని విధుల నుంచి తప్పించడం, మారణాయుధంతో హాని కలిగించడం వంటి అభియోగాలు అతనిపై ఉన్నాయి. మరోవైపు నుహ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో బిట్టు బజరంగీ రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతనిపై ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!