దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నిర్వహించుకున్నారు. అయితే మధ్యప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి ఉన్నట్టుండి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న అధికారులు ఆయనును పట్టుకున్నారు. అనంతంరం చికిత్స నిమిత్తం భోపాల్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. రైసేన్ జిల్లాలోని హోంగార్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అది ముగిసిన కొంత సమయం తరువాత కొన్ని సెకన్లకే మంత్రి హఠాత్తుగా కిందపడిపోయారు. మంత్రికి అధిక రక్తపోటు, షుగర్ లెవల్స్ కారణంగా అలా జరిగి ఉండొచ్చని ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యులు తెలిపారు. మరోవైపు అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా స్పీచ్ ఇచ్చే క్రమంలో కుప్పకూలారు. ఆయనను కూడా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc
— NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023
Read Also: Seerat Kapoor: త్రివర్ణ రంగుల్లో మెరిసిన సీరత్ కపూర్
అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి ప్రభురామ్ చురుకుగా పాల్గొన్నారు. ‘హర్ గర్ తిరంగ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఇలాంటి సంఘటనలు జరగడంతో.. అక్కడి వారంతా నిరాశగా ఉన్నారు.
स्वतंत्रता दिवस समारोह में मंच पर गिरे स्वास्थ्य मंत्री
– शुगर लेवल हाई होने से बिगड़ी तबीयत
– कलेक्टर और एसपी लेकर पहुंचे अस्पताल pic.twitter.com/noPJLkvfeS— Nitinthakur (@Nitinreporter5) August 15, 2023