ప్రపంచంలో ఎన్నో వింత వింత జీవులు, జంతువులు చూస్తుంటాం. అందులో ఇదొక రకమైన వింత జీవి. దాన్ని చూస్తేనే గగుర్పాటు కలిగిలే ఉంది. ఇంతకీ అది ఏమంటారా.. అదొక సముద్ర జీవి. దాని మెడ చుట్టూ పదునైన దంతాలు ఉన్నాయి. ఇది సముద్రంలో చేపలను చంపి వాటి రక్తాన్ని పీల్చుతూ బతుకుంది.
Read Also: Boora Narsaiah Goud: అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్ల కేటాయింపు
ఈ వింత జీవిని బ్రిటన్‌కు చెందిన క్రైగ్ ఎవాన్స్ అనే వ్యక్తి మొదటగా చూసి సముద్ర జీవి అని కనుగొన్నాడు. అనంతరం దాని యొక్క చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దాని గురించి వివరణ ఇచ్చారు. ఆ ఫొటోలో ఆ జీవి నోరు తెరిచి ఉన్నట్లు కనిపిస్తుంది. దాని గొంతు చుట్టూ పదునైన దంతాలు ఉన్నాయి. అవి చూస్తే చాలా భయంకరంగా ఉంది. దానిని సీ లాంపే అంటారని ఎవాన్స్ పేర్కొన్నాడు.
Read Also: BRICS Summit: బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ సంభాషణలు
మరోవైపు ఈ జీవి ఫొటోను షేర్ చేసిన ఎవాన్స్.. దానిపై క్యాప్షన్ కూడా ఇచ్చాడు. “వెస్ట్ వేల్స్ నదిలో చేపలు పట్టేటప్పుడు ఈ చనిపోయిన ‘సీ లాంప్రే’ని కనుగొన్నానని తెలిపాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ జీవులను చూస్తున్నానని.. వాటి ఆహారం క్షీరదాలు, బీవర్లు తింటాయని పేర్కొన్నాడు. ఇవి పురాతన కాలం నుంచి ఉంటున్నాయని.. వీటికి దవడలు ఉండవని ఎవాన్స్ సూచించారు.
Read Also: Life Tax On EV’s: ఎలక్టిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు
ఈ పోస్ట్ను ఆగస్టు 15న సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పటివరకు 600 లైక్ లు వచ్చాయి. అంతేకాకుండా ఈ వింతజీవిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అబ్బో! అదో మృగం! అని ఓ వ్యక్తి వ్రాయగా.. మరో వ్యక్తి “ఇది చాలా బాగుంది! ప్రకృతి అద్భుతం” అని మరొకరు పోస్ట్ చేశారు.