పెరుగుతున్న ఉల్లిధరలపై మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓ నాలుగు నెలల పాటు ఉల్లిని తినకపోతే పోయేదేం లేదన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై కేంద్రప్రభుత్వం 40 శాతం సుంకాన్ని విధించింది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, ఉల్లి ధరలను అదుపు చేయడానికి ఉల్లి ఎగుమతులపై భారీ సుంకాన్ని విధించింది. ఉల్లిపై తొలిసారి నోటిఫికేషన్ ద్వారా ఎగుమతి సుంకాన్ని విధించారు. ఇది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉల్లి రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎగుమతులపై పన్ను విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
Read Also: Kushi : సెన్సార్ పూర్తి చేసుకున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే సంచలన హాట్ కామెంట్స్ చేశారు. రూ.10 లక్షల విలువ చేసే కారు వాడుతున్నవారికి రూ.10 లేదా రూ.20 పెరిగితే సమస్య ఏమీ ఉండదని, అదే ఉల్లిగడ్డలను కొనే సామర్థ్యం లేనివారు.. ఒక రెండు నుంచి నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే పోయేదేమీ ఉండదు అని మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి అన్నారు. ఉల్లి ఎగుమతులపై పన్ను విధించే నిర్ణయాన్ని అందరినీ సమన్వయం చేసుకుని తీసుకోవాల్సిందని మంత్రి పేర్కొన్నారు. ఒక్కోసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుందని, మరికొన్ని సందర్భాల్లో రూ.2,000కు పెరుగుతుందన్నారు. ఎగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ధరలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.