నేపాల్‌లోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయ యాత్రికులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో 19 మంది యాత్రికులు గాయపడ్డారని నేపాల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం బారా జిల్లాలోని చురియమై సమీపంలో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 27 మంది యాత్రికులతో వెళుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.
Read Also: MGNREGS: ఉపాధి హామీ కింద సెప్టెంబర్ 1 నుంచి ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి
తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈస్ట్-వెస్ట్ హైవేపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. భారత్ లోని రాజస్థాన్ కు చెందిన వారు తీర్థయాత్రలకు వెళ్లి ఆరుగురు దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నేపాలీకి చెందిన ఓ వ్యక్తి కూడా మరణించాడని పేర్కొన్నారు.
Read Also: NTR-Mokshagna: అన్నదమ్ముల అనుబంధం.. ఏం ఉన్నార్రా బాబు
మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాత్రికులను బస్సులో నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని హెటౌడలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడ్డ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.