ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వివో కంపెనీ నుంచి తక్కువ ధరలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ లో కెమేరా క్వాలిటీ ఎంతో బాగుంది. ఫొటోలకు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను రూపొందించినట్టు ఫీచర్లు చూస్తే అర్థమవుతుంది.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్‌కతాలో అన్నారు.
పల్లీలు తినడం అంటే చాలామందికే ఇష్టం. ఎవరో కొందరు తినకపోవచ్చు కానీ.. చట్నీలు, స్వీట్స్ కు ఎక్కువగా వాడుతుంటారు. టిఫిన్స్ లో పల్లీ చట్నీ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే పల్లీలను రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
తమకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించగా.. సాయత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బేగంపేట్, తార్నాక, ఉప్పల్, హిమాయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
సిద్దిపేటలో మెగా డ్రోన్ షో నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. కోమటి చెరువు వేదికగా 450 డ్రోన్ లతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగాగా హాజరై.. షోను తిలకించారు.
పశ్చిమ బెంగాల్‌లోని దుత్తాపుకూర్‌లో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.