సూర్యాపేట జిల్లా కేంద్రంలో 215 కుట్టు మిషన్లను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటుగా స్పందించారు. తన వెంట ఉండి, ప్రజలను బెదిరించి బ్లాక్ మెయిల్ లకు పాల్పడితే జైలుకు పంపడానికి కూడా వెనకాడనని మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Uddav Thackeray: కేసీఆర్ దేశం కోసం పోరాడుతున్నారా?.. బీజేపీకి మద్దతిస్తున్నారా?.. ఉద్ధవ్ ప్రశ్నలు
గత కొద్దిరోజులుగా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్ పర్సన్ వట్టే జానయ్య పై భూకబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో 42 మంది బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని రోడ్డు ఎక్కారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాక రేపుతున్నాయి.
Read Also: NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?
పార్టీలో చేరే వారు ఆ పార్టీలో చేసినట్లు తన దగ్గర చేస్తే కుదరదని… శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరికైనా చిప్పకూడు తినిపిస్తానన్నారు. పార్టీ మారి వచ్చిన వాళ్లకు ముందే చెప్తున్న అంటూ మంత్రి హెచ్చరించారు. ఓట్ల కోసం ఏనాడూ పాకులాడలేదని.. సూర్యాపేట ప్రజలు తనను ఎందుకు ఎన్నుకున్నారో తనకు తెలుసని.. వాళ్లకు తానేం చేయాలో స్పష్టత ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.