బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలింది.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
యోగా చేస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని చెబుతుండగా.. ముఖ్యంగా మూడు యోగాసనాలు రోజూ వేయడం ద్వారా గుండె జబ్బుల బారినపడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. ఆ యోగాసానాలు ఏంటంటే.. ఉత్థిత త్రికోణాసనం, పశ్చిమోత్తానాసనం, అర్ధ మత్య్సేంద్రాసనం.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు.
పదేళ్ల క్రితం ఘటన గుర్తుకు వచ్చి కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి దూకి మరీ మహంకాళి ఏసీపీ రవీందర్ కు దండం పెట్టింది ఓ వృద్ధురాలు. వేగంగా పరిగెత్తుకుంటు రావడం చూసి బస్సులో ఏమైనా మరిచిపోయి ఉండి బస్సు కోసం పరుగున వెళ్తుంది అనుకున్నారు. కాని సదరు మహిళ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్ ను కలవడానికి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. Read […]
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో 'రైతు గోస-బీజేపీ భరోసా' బహిరంగ నిర్వహిస్తుంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు రగులుతున్నాయి. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పార్టీ కార్యకర్తలతో సారంగపల్లిలో భేటీ అయ్యారు. ములుగు నుంచి బరిలో దిగనున్నట్లు ప్రహ్లాద్ తెలుపుతున్నారు. ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంపై ప్రహ్లాద్ అసంతృప్తి సెగలో ఉన్నారు.
సీపీఐ నేతలతో థాక్రే చర్చలు జరిపారు. ఈ సమావేశంలో థాక్రే ముందు సీపీఐ నేతలు ప్రతిపాదనలు ఉంచారు. సీపీఐ నాలుగు స్థానాలు కావాలని అడిగింది. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను సీపీఐ ఆశించింది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని ఆరోపించారు.
హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదని పేర్కొన్నారు.