పల్లీలు తినడం అంటే చాలామందికే ఇష్టం. ఎవరో కొందరు తినకపోవచ్చు కానీ.. చట్నీలు, స్వీట్స్ కు ఎక్కువగా వాడుతుంటారు. టిఫిన్స్ లో పల్లీ చట్నీ అంటే లొట్టలేసుకుని తింటారు. అయితే పల్లీలను రోజూ తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పల్లీలు తినడం ద్వారా లాభాలు, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Read Also: Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది.. మీలా మోసం చేయదు..
పల్లీల్లో ప్రొటీన్, ఆరోగ్యానికి మించి చేసే కొవ్వులు, పీచు, విటమిన్ బీ, విటమన్ ఈ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అంతేకాకుండా.. మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ అనే కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటివల్ల గుండెకు ఎంతో మేలు చేసి.. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తాయి. రెస్వెరట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
పల్లీలతో బరువు కూడా నియంత్రించవచ్చు. పీచుకు తోడు ప్రొటీన్ ఉన్నందున కడుపునిండిన తృప్తి లభించి, ఎక్కువ సమయం పాటు వేరే పదార్థాలు తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గుతారు. పల్లీ గింజల్లో ఫైబర్ ఉండటం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గుతుంది. పల్లీలతో ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి. ఒకేసారి గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి. మధుమేహంతో బాధపడేవారు, మధుమేహం వచ్చే అవకాశం ఉన్న వారు రోజూ పల్లీలు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా రోజూ పల్లీలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని ఓ అధ్యయంలో వెల్లడించింది. పల్లీలతో పాటు ఇతర నట్స్ తినేవారికి, అసలు తినని వారితో పోలిస్తే మరణ ముప్పు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.