నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వర్షాన్నే కాదు విపత్తును కూడా తెచ్చిపెట్టాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 381 మంది వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. వివిధ సంఘటనలలో 360 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 38 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.8642.83 కోట్ల నష్టం వాటిల్లింది.
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్ చేయడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మిషన్ యొక్క విజయం కేవలం ఇస్రోది మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పురోగతి చిహ్నంగా పేర్కొంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్‌సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది.
కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. తన X (ట్విట్టర్)లో మళయాళంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో DMK చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు.