చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్ చేయడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మిషన్ యొక్క విజయం కేవలం ఇస్రోది మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పురోగతి చిహ్నంగా పేర్కొంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుతామని ఆయన ప్రకటించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.
Read Also: Imran Khan: బెయిల్‌పై విడుదలైన గంటల్లోనే మళ్లీ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..
శాస్త్రవేత్తలకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో దిగిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. “ఊహించిన ఖచ్చితత్వంతో చంద్రునిపై ల్యాండింగ్ అనేది ముఖ్యమైన విజయం.” అని ఆయన పేర్కొన్నారు. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో ల్యాండింగ్.. కష్టతరమైన పరిస్థితులను అధిగమించడం, శతాబ్దాల నుండి మానవ జ్ఞానం యొక్క సరిహద్దులను నెట్టడానికి ప్రయత్నిస్తున్న మన శాస్త్రవేత్తల స్ఫూర్తికి నిదర్శనం” అని తీర్మానం చేశారు.
Read Also: Onam Special: ఓనమ్ స్పెషల్.. ఈ కేరళ కుట్టీలు ఉంటారు బాసూ.. వేరే లెవెల్ అంతే
మరోవైపు ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్-3.. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినప్పటి నుంచి చంద్రుడిపై పరిశోధనలు మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని గంటలకే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికి వచ్చింది. ఆ వెంటనే పని ప్రారంభించింది. భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా, చంద్రుని ఉపరితలంపైకి వెళ్లిన నాల్గవ దేశంగా అవతరించింది.