15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) కు కేంద్రప్రభుత్వం ఓకే చెప్పిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపిందని.. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. సర్వే పూర్తవగానే DPR ల పనులు ప్రారంభిస్తారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జాయింట్ ఆపరేషన్‌లో 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) ఆదివారం తెలిపింది.
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లీతో రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావారణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కా తమ్ముడిపై శివకుమార్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘవి, పృథ్వీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.