పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది. దుత్తాపుకూర్‌లో పేలుడు జరిగిన ప్రదేశంలో ఆర్‌డిఎక్స్(RDX) ఉండొచ్చని పేర్కొంటూ బీజేపీ నేత ఈ పిల్ దాఖలు చేశారు.
Read Also: LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ
మరోవైపు “తక్షణ పిల్ వేయవల్సిన అవసరం ఏమిటి? దర్యాప్తు పట్టాలు తప్పుతోంది” అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. NIA బృందం సోమవారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిందని.. జాతీయ దర్యాప్తు సంస్థ తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ బిల్వాదల్ భట్టాచార్య కోర్టుకు తెలిపారు. పేలుడు పదార్థాల చట్టంలోని నిబంధనలను రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలపై మమతా బెనర్జీ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అతను పేలుడు పదార్థాల నిపుణుడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ పట్టుబడుతుంది. మరోవైపు.. పేలుళ్లను నివారించడానికి, కార్మికుల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్రంలో గ్రీన్ పటాకుల యూనిట్ల క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: Siva Nirvana: ఖుషీ కోసం శివ నిర్వాణకి 12 కోట్ల రెమ్యునరేషన్.. అసలు సంగతి చెప్పేశాడు!
మే లో.. తూర్పు మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో అక్రమ క్రాకర్ యూనిట్‌లో పేలుడు సంభవించి 12 మంది మరణించారు. అదే నెలలో కోల్‌కతాకు 26 కిలోమీటర్ల దూరంలోని బడ్జ్ బడ్జ్ వద్ద అక్రమ బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన పేలుడులో మైనర్‌తో సహా ఒక కుటుంబంలోని ముగ్గురు మరణించారు. కొంత మందికి గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతుంది.