జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న 25 ఏళ్ల వ్యక్తి శనివారం ఆసుపత్రిలో మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని పంచ్లా ప్రాంతంలో మృతుడి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. తనను చిత్రహింసలకు గురిచేయడం వల్లే మరణించాడని ఆరోపిస్తూ రహదారిని దిగ్బంధించారు.
(INDIA) కూటమి అధికారంలోకి వస్తే ఎల్‌పిజి సిలిండర్‌లను రూ. 500 తక్కువ ధరకు అందజేస్తామని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని నడ్డా ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించరని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను సంతోష పెట్టడంలో కాదు.. దోచుకోవడంలో నిమగ్నమై ఉన్నారని నడ్డా పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లో ఆడబిడ్డలకు భద్రత లేదని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుందని.., ఆ డబ్బును ఢిల్లీకి పంపి ఆ పార్టీ అధినేతల జేబులు నింపుతోందని నడ్డా మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడి, కాంగ్రెస్ అంటే అవినీతి, అలాంటి ప్రభుత్వాన్ని బతకనివ్వద్దని అన్నారు.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని బహేరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అరుదైన జన్యుపరమైన రుగ్మత (హార్లెక్విన్ ఇచ్థియోసిస్)తో శిశువు జన్మించింది. అయితే ఆ శిశువు మూడు రోజులు గడిచినా ఇంకా బతికే ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారంలో పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతిని లక్ష్యం చేసుకుని 'ఆరోప్ పత్ర' పేరుతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి రాహుల్ బాబాయ్ గిరిజనులకు ఏం చేశారో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించడంపై రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ.. రక్షా బంధన్‌కు ముందు దేశంలోని సోదరీమణులకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి అని అటుండగా.. మరోవైపు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష కూటమి ఎన్నికల బహుమతిగా విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ఇది ఎన్నికల లాలీపాప్‌గా అభివర్ణించారు.