నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఇది బాగా సహాయ పడుతుంది. ఉదయం గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగే వారు చాలా మందే ఉన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బలంగా తయారవుతుంది. అంతేకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ లెమన్ వాటర్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
AP Employees: జీపీఎస్ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య పంచాయతీ
నిమ్మరసం తాగితే జీర్ణశక్తి మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియలు చురుగ్గా పని చేయడాని ఎంతో తోడ్పడుతుంది. నిమ్మలో విటమిన్ ‘సీ’ చాలా ఉంటుంది. నిమ్మరసం తాగితే వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. అంతేకాకుండా గాయాలు మానడంలో, కొల్లాజెన్ ఉత్పత్తికి సాయపడుతుంది. చర్మం, కణజాలం ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజెన్ అవసరం. కణాలు దెబ్బతినకుండా విటమిన్ ‘సీ’ చూస్తుంది. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. చర్మం ముడతలు పడడాన్ని కూడా నివారిస్తుంది. అలానే జలుబు, దగ్గు వంటి సమస్యలే కాకుండా ఆస్త్మా మరియు అలర్జీతో బాధపడే వాళ్లు కూడా దీన్ని తీసుకుంటే దివ్యౌషధంలా పని చేస్తుంది. ఉదయాన్నే నిమ్మ రసం తాగడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనం కలుగుతుంది.
Nitish Kumar: ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు.. ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చన్న నితీష్
నిమ్మ నీరు బరువు తగ్గేందుకు కూడా సాయపడుతుంది. శరీరంలో చెడు కొవ్వులు కరిగిపోతాయి. ప్యూరిఫికేషన్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. లివర్ డిటాక్సిఫై చేయడంతో పాటు.. ప్రోటీన్లను మరియు బయో కెమికల్స్ ను ఉత్పత్తి చేయడంతో జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. నిమ్మలోని పొటాషియం గుండెకు రక్షణనిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఆర్టరీస్ దెబ్బతినకుండా యాంటీ ఆక్సిడెంట్లు రక్షణనిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ సాయపడుతుంది. నిమ్మలోని అసిడిక్ గుణం పళ్ళపై ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడూ నీళ్లతో కలిపే తీసుకోవాలి. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను నిమ్మలోని విటమిన్ సీ నివారిస్తుంది. నిమ్మలోని అసిడిక్ స్వభావంతో నీటికి ఆల్కలైజింగ్ స్వభావం ఏర్పడుతుంది. ఇది శరీరంలో పీహెచ్ బ్యాలన్స్ కు మేలు చేస్తుంది. ఫలితంగా ఆరోగ్యం దృఢంగా ఉంటుంది.