కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఎల్లుండి (శనివారం) నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది.
వెటరన్ బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్ గురువారం రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా షెల్డన్ నిలిచాడు. రాజ్‌కోట్‌లో అస్సాంతో జరిగిన చివరి లీగ్ దశలో షెల్డన్ జాక్సన్ ఈ ఫీట్ సాధించాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు కొట్టాడు.
తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు.
తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వైసీపీ 'ఫీజు పోరు' పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు.
విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార స్వామి బిజీబిజీగా గడిపారు. ఆయనతో పాటు.. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఐఎన్ఎల్ (RINL) డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు ఇవాళ తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాల కల్పన జరుగనుంది.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.
ప్రధాని మోడీని మహ్మద్ గజనీతో పోల్చతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు.