వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు.
సీఎం చంద్రబాబు రాయచోటి పర్యటనపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి పర్యటన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది భారత్.. 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇంఛార్జి మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగే రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో కార్యాచరణపై లోకేష్ మంత్రులతో చర్చించారు.
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను కాలువలో పడేశాడు కుమారుడు.
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.