Ranji Trophy: రంజీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాది.. రికార్డు సృష్టించిన బ్యాటర్
- రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించిన షెల్డన్ జాక్సన్
- రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా షెల్డన్
- భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెటరన్ బ్యాట్స్‌మెన్ షెల్డన్ జాక్సన్ గురువారం రంజీ ట్రోఫీలో రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా షెల్డన్ నిలిచాడు. రాజ్‌కోట్‌లో అస్సాంతో జరిగిన చివరి లీగ్ దశలో షెల్డన్ జాక్సన్ ఈ ఫీట్ సాధించాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నమన్ ఓజా రికార్డును షెల్డన్ బద్దలు కొట్టాడు. ఇంతకుముందు నమన్ ఓజా ఖాతాలో 143 సిక్సర్లు ఉన్నాయి. షెల్డన్ తన 100వ రంజీ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. షెల్డన్ రంజీ ట్రోఫీలో 6600 పరుగులు చేశాడు. ఛెతేశ్వర్ పుజారా, సితాన్షు కోటక్ తర్వాత సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌లలో జాక్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షెల్డన్.. అస్సాం ఫాస్ట్ బౌలర్ రాహుల్ సింగ్ ఓవర్‌లో సిక్సర్ కొట్టి ఈ ఘనత సాధించాడు.
Read Also: Gensol EV: మూడు చక్రాల బుజ్జి కారు.. లాంచ్‌కు ముందే 30 వేల ప్రీ- బుకింగ్స్!
Also Read
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
సౌరాష్ట్ర తరపున షెల్డన్ 21 ఫస్ట్ క్లాస్ క్రికెట్ సెంచరీలలో 19 సాధించాడు. 2011–12 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన జాక్సన్ తన కెరీర్‌లో 7000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో 100కు పైగా సిక్సర్లు బాదిన ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లలో జాక్సన్ ఒకరు. సౌరభ్ తివారీ, మనీష్ పాండే, పరాస్ డోగ్రా, యూసుఫ్ పఠాన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. 2019–20 సీజన్‌లో సౌరాష్ట్ర తొలి రంజీ ట్రోఫీ విజయంలో జాక్సన్ భాగమయ్యాడు. ఆ సీజన్‌లో అతను 50 సగటుతో 809 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు చేశాడు. ఈ క్రమంలోనే సెమీఫైనల్‌లోనూ సెంచరీ సాధించాడు. 2022-23 సీజన్‌లో జాక్సన్ 588 పరుగులు చేశాడు. దీంతో.. సౌరాష్ట్ర రెండోసారి ట్రోఫీని అందుకుంది. ఆ సమయంలో కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్‌లో 160 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: S Jaishankar: డొనాల్డ్ ట్రంప్ ‘‘అమెరికన్ జాతీయవాది’’..
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!