భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఎన్నుకున్నారు. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహా సభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌లను నియమించారు.
అంతర్జాతీయ మహిళల అండర్-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసి, చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. త్రిష సాధించిన సెంచరీ.. క్రీడల్లో రాణించాలనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు.
హనుమకొండ నగరంలోని గోపాల్‌పూర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి వచ్చాడు భరత్ అనే యువకుడు. తన ఇంట్లో కూతురుతో యువకుడిని చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. బాలిక తండ్రి యువకుడిని పట్టుకునే ప్రయత్నంలో గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో.. బాలిక తండ్రి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. యువకుడు భరత్ గొంతు కోశాడు బాలిక తండ్రి. ప్రియుడి గొంతు కోయడం చూసి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా అని ప్రశ్నించారు. రైతు భరోసా చిల్లర పంచాయతీనా ముఖ్యమంత్రి గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నల్లగొండలో రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడని విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ రైతు ధర్నాకు వెళ్తున్న క్రమంలో కేటీఆర్‌ను ఆపిన యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వినతి పత్రంలో అందించారు.
దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వివరాలను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం.. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో వ్యాపారులు ముందుకు వచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు.