దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు.
పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని సీఎం వెల్లడించారు.
మాదాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 24న తనిఖీలో భాగంగా కిచెన్‌లో పలు కాలం చెల్లిన వస్తువులతో పాటు అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఫిర్యాదులు రావడంతో కిచెన్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రకటించారు.
రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
సరస్వతి నది పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు.. అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది.
శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ వద్ద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో శ్రీ చైతన్య సిబ్బంది వాగ్వాదానికి దిగింది. గ్రేటర్ హైదరాబాద్‌కి సంబంధించిన శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గత శుక్రవారం సస్పెండ్ చేశారు.