ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 4-1 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. అయితే ఈ సిరీస్‌లో సూర్య కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇది సూర్య కెరీర్‌లో చెత్త రికార్డు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖ అస్త్రాన్ని సంధించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయని వాటిని అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖలో కోరారు.
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్-1, ఫేజ్-2లను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అండర్-19 భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా కాసేపట్లో చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.
పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది.
ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు.. విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్, తెలంగాణకు చెందిన గొంగడి త్రిష పాత్ర మరువలేనిదని కొనియాడారు.